సితార సంస్థలో ప్లానింగ్ లోపం

హారిక హాసినీ క్రియేషన్స్(Haarika Haasini creations), సితార ఎంటర్ టైన్ మెంట్స్(Sithara entertainments) రెండూ ఒక ఫ్యామిలీవే. హారిక హాసినీ సంస్థ స్టార్లతో బిగ్ బడ్జెట్ మూవీస్ నిర్మిస్తే..సితార ఎంటర్ టైన్ మెంట్స్ నెక్ట్ లెవెల్ హీరోలతో మీడియం రేంజ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. హారిక హాసినీ సంస్థలో మూవీస్ పోస్ట్ పోన్ అవడం అరుదుగా జరుగుతుంటుంది కానీ సితార సంస్థలో ప్రొడ్యూస్ అయ్యే మూవీస్ తప్పనిసరిగా రిలీజ్ వాయిదా పడుతుంటాయి.

గతేడాది నుంచి ఇది మరీ ఎక్కువగా జరుగుతోంది. ఆదికేశవ(Adikeshava), టిల్లు స్క్వేర్(Tillu square), గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari) సినిమాలు పలుమార్లు వాయిదాలు పడ్డాయి. వీటిలో కొన్ని సినిమాలు దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన సందర్భాలున్నాయి. హీరో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చెప్పిన డేట్ కు రిలీజ్ చేయకుంటే ప్రమోషన్స్ కు రానని అనేదాకా ఈ వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. ఇదంతా సంస్థలోని ప్లానింగ్ లోపమే అనుకోవాలి. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాను కూడా రిలీజ్ వాయిదా వేశారు. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానుంది.