ఇటీవల ఓటీటీలో రిలీజైంది పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతోంది. టీజర్ తో బ్రో మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అవేమీ థియేటర్ లో నిజం కాలేదు. సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో మాత్రం బ్రో మూవీకి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలోనూ బ్రో టాప్ లో ట్రెండ్ అవడం సర్ ప్రైజ్ చేస్తోంది.
తమిళ హిట్ ఫిల్మ్ వినోదయ సితమ్ తెలుగు రీమేక్ గా దర్శకుడు సముద్రఖని ఈ సినిమాను రూపొందించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయగా, పవన్ దేవుడు టైటాన్ క్యారెక్టర్స్ లో నటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించింది. పవన్, సాయి తేజ్ కలిసి నటించిన సినిమాగా మెగాభిమానులు బ్రో సినిమా అప్ డేట్ వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.