విదేశాలకు వెళ్తున్న “ఓజీ”

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ఓజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ చేస్తున్న ప్రెజంట్ మూవీస్ లో ఓజీనే త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ చేసుకోవడం మెరుపు వేగాన్ని గుర్తుచేస్తోంది. ఇక తాజాగా ఓజీ షూటింగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారం నుంచి విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తుందట..

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంతా పవన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటారు. వారం పాటు ఈ సినిమా చిత్రీకరణ చేశాక…ఓజీ షూటింగ్ కోసం పవర్ స్టార్ ఫారిన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు మూడు వారాల పాటు ఈ సినిమా షెడ్యూల్ చేస్తారట. ఈ ఫారిన్ షెడ్యూల్ లో సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలు, పాటల చిత్రీకరణ జరపనున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డేకు ఓజీ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టీమ్. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణంలో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.