“ఉస్తాద్ భగత్ సింగ్” లేనట్లేనా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈ సినిమా హోల్డ్ లో పడింది. ఎన్నికల్లో గెలిచి పవన్ డిఫ్యూటీ సీఎం అయ్యాక…ఇంకా బిజీ అయ్యారు. దీంతో ఆయన హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలు పూర్తి చేస్తే అదే గొప్ప విషయం అనేంతగా టాక్ మొదలైంది. ఈ బిజీలో ఉస్తాద్ భగత్ సింగ్ కు ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది టాపిక్ గా మారింది.

తెరి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ కథకు స్క్రీన్ ప్లే రైటర్ గా ప్రముఖ దర్శకుడు దశరథ్ వర్క్ చేస్తుండడం విశేషం. తెరి మూవీని బాలీవుడ్ లో బేబీ జాన్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. అక్కడ ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తీస్తే.. కోలీవుడ్ తెరితో పాటు.. బాలీవుడ్ బేబీ జాన్ తో కూడా పోలుస్తారు. అందుచేత కథ పై మరింత కేర్ తీసుకోవాలి.. మరోసారి కసరత్తు చేయాలి..వీళ్లు కథతో రెడీ అయ్యేసరికి పవన్ అందుబాటులో ఉంటాడా అనేది సందేహంగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో.. ఉండదో.. అనే టాక్ కూడా వినిపిస్తోంది.