షూటింగ్ లకు పవన్ మూడు వారాల బ్రేక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాల మధ్య ట్రావెల్ అవుతున్నారు. ఏపీలో కొద్ది నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీంతో అక్కడ ప్రజల్లో ఉండటం పవన్ కు ముఖ్యం. ఈసారి జనసేన నుంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇందుకే తాజాగా తన కొత్త సినిమా ఉస్తాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసి మళ్లీ తన రాజకీయ వ్యవహరాల్లోకి వెళ్లిపోయారు పవన్.

ఇటీవల ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ చేశారు. ఈ షెడ్యూల్ లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేశారు. ఇది స్వల్ప షెడ్యూల్ అయినా సినిమాకు కీలకం అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ చెబుతున్నారు. పవన్ ఈ షెడ్యూల్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇక నెక్ట్ షెడ్యూల్ మరో మూడు వారాల తర్వాతే అని తెలుస్తోంది.

అక్టోబర్ థర్డ్ వీక్ లో మళ్లీ ఉస్తాద్ షూటింగ్ ఉంటుందట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ హిట్ ఫిల్మ్ తెరీ తెలుగు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తెరకెక్కిస్తున్నారు.