“ఓజీ” గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్ చేసిన ఫ్యాన్స్

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మాణంలో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది.

పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఓజీ గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందో చెప్పాలంటే చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులే అడుగుతోంది. ఈ పోస్టుకు అభిమానులు భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. అభిమానుల సూచన మేరకు ఉదయం 10.35 నిమిషాలకు ఓజీ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించారు.

ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. వచ్చే వారం నుంచి విదేశాల్లో షూటింగ్ కు ఓజీ టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది. దాదాపు నెల రోజుల పాటు ఫారిన్ లోనే ఈ సినిమా షూట్ సాగనుందని సమాచారం. పవన్ సహా టీమ్ అంతా ఓవర్సీస్ వెళ్తున్నారు. అక్కడే కీలక సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.