పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ క్రేజ్ ఓవర్సీస్ కు చేరింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ డీలింగ్స్ క్లోజ్ అయ్యేంద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ ఓవర్సీస్ బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఓజీ ఓవర్సీస్ రైట్స్ ను రికార్డ్ ధరకు అమ్మినట్లు సమాచారం. 13 కోట్ల రూపాయలకు ఓజీ ఓవర్సీస్ రైట్స్ ఇచ్చారట. మన స్టార్ హీరోల సినిమాల బిజినెస్ తో కంపేర్ చేస్తే ఇది పెద్ద డీల్ అనుకోవచ్చు. ఈ సినిమాకు మొదటగా పూర్తి చేసిన అగ్రిమెంట్ ఇదేనని తెలుస్తోంది. రీసెంట్ గా ఓజీ గ్లింప్స్ వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ క్రేజ్ కు కారణంగా అనుకోవచ్చు.
ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఓజీ నెక్ట్ మంత్ ఫారిన్ షూటింగ్ కు రెడీ అవుతోంది. థాయ్ లాండ్ లో నెలరోజుల పాటు సాగే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ పాల్గొనే ఈ షెడ్యూల్ లో సినిమా కీ సీన్స్ తెరకెక్కిస్తారట. వచ్చే సమ్మర్ లో ఓజీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు టీమ్.