అగ్నిప్రమాదంలో పవన్ చిన్న కొడుకుకు గాయాలు

పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కు అగ్నిప్రమాదంలో గాయాలు అయ్యాయి. సింగపూర్ లో చదువుకుంటున్న మార్క్ శంకర్ స్కూల్ క్యాంప్ లో మిగతా పిల్లలతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్యాంప్ జరుగుతున్న భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పిల్లలను కాపాడారు. అయితే అప్పటికే పవన్ కుమారుడి కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ తన పర్యటనలు రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు.