సురేందర్ రెడ్డితో పవన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ బెటర్ మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి.

దర్శకుడు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ నెరేట్ చేసిన కథ పవన్ కు నచ్చిందని, సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. స్నేహితుడు రామ్ తాళ్లూరికి పవన్ ఈ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఆఫీస్ ప్రారంభోత్సవం కూడా జరిపారట.

అయితే ఈ సినిమా పవన్ ఇప్పుడున్న బిజీలో సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే. ఆయనకు కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఓజీ, ఉస్తాద్, హరి హర వీరమల్లు ఉన్నాయి. వీటికే డేట్స్ కేటాయించలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడు. మరోవైపు ఏపీలో ఎలక్షన్స్ కు మరి కొద్ది నెలలే టైమ్ ఉంది. సో..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా చేసుకుని ఏపీ ఎలక్షన్స్ తర్వాతే పట్టాలెక్కే అవకాశముంది.