గండిపేటలో పవన్ “ఉస్తాద్” షూటింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షార్ట్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ ప్రారంభమైంది. గండిపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. ఈ షూటింగ్ లో పవన్ తో పాటు హీరోయిన్స్ శ్రీలీల, సాక్షి వైద్య పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ చిన్నదైనా కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.

ఐదు రోజుల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ కొనసాగనుంది. ఈ షెడ్యూల్ ముగించుకుని వచ్చే నెల 1వ తేదీ నుంచి వారాహి యాత్రలో పాల్గొనబోతున్నారు పవన్. ఉస్తాద్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రూపొందిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ స్టోరిగా ఈ సినిమా ఉండనుంది.