మహేష్‌ మూవీ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. అదే సంస్థకు రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ తో మూవీ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి ఇమేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది.

దీంతో మహేష్‌ తో జక్కన్న చేసే సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ వర్క్ షాపు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నారు. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. రాజమౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్‌ మహేష్‌, రాజమౌళి మూవీ గురించి మాట్లాడడం ఆసక్తిగా మారింది. ఇంతకీ పవర్ స్టార్ ఏమన్నారంటే.. రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని అభినందించారు. అలాగే మహేష్‌ బాబుతో ఆయన చేయబోయే సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలన్నారు. తనకు అందరు హీరోలు ఇష్టమని, వారివల్ల ఎందరో కడుపు నిండుతుందని చెప్పుకొచ్చారు. అయితే.. మహేష్‌ గురించి పవన్ ప్రస్తావించడం ఆసక్తిగా మారింది.