ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేసిన పవన్ “బ్రో”

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ సౌత్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. డియర్ బ్రో స్ జల్సా చేసుకునేందుకు సిద్ధమవండి…ఎందుకంటే ఓజీ బ్రో ఐదు భాషల్లో మీ ముందుకు వచ్చేశాడు అంటూ నెట్ ఫ్లిక్స్ సౌత్ తన పోస్టులో పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో బ్రో స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ హిట్ ఫిల్మ్ వినోదయ సితమ్ రీమేక్ గా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. కేతిక శర్మ, ప్రియా వారియర్ కీ రోల్స్ లో నటించిన ఈ సినిమా గత నెల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కథ కంటే పవన్ ఇమేజ్ మీదే ఎక్కువగా ఆధారపడటం సినిమాను ముంచేసింది.