పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రూపొందుతోన్న మూవీ ఫౌజీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ ఇంతవరకు చేయనటువంటి సైనికుడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఆయన బ్రహ్మాణ యువకుడుగా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కు జంటగా ఇమాన్వీ నటిస్తోంది. మరో కథానాయిక పాత్ర కోసం దిశా పటానీని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఫౌజీ అయ్యాక ప్రభాస్, హను కలిసి మరో సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ నచ్చడంతో మరో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పాడట. ప్రభాస్ హోంబేలో ఫిల్మ్స్ లో మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. సలార్, సలార్ 2 ఆ బ్యానర్ లోనే చేస్తున్నాడు. ఇంకా ఆ బ్యానర్ లో మరో సినిమా చేయాలి. అది హనుతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి ఫౌజీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నుంచి నెక్ట్స్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని.. ఈసారి మరో డిఫరెంట్ స్టోరీతో సినిమా చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. మొత్తానికి హను.. వరుసగా ప్రభాస్ తో రెండు సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకోవడం విశేషమే. ప్రస్తుతం ప్రభాస్ లైప్ లో ఫౌజీతో పాటు ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి.