పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓంతరౌత్ తెరకెక్కించాడు. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే.. ఈ రోజు శ్రీవారిని హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓంరౌత్ దర్శించుకున్నారు. అనంతరం గుడి బయటకు వచ్చిన తర్వాత వెళ్లిపోతున్న కృతి సనన్ కు దర్శకుడు ఓంరౌత్ హగ్ ఇచ్చాడు.. కిస్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు వివాదస్పం అయ్యింది.
అయితే.. ఓంరౌత్ నిజంగా తప్పు చేశాడా..? అంటే.. తప్పు అనేవాళ్లు ఉన్నారు. అలాగే అదేం పెద్ద తప్పు కాదు అనే వాళ్లు ఉన్నారు. నార్త్ లో అందులోనూ సినీ ఇండస్ట్రీలో సెండాప్ ఇచ్చేటప్పుడు హగ్ లు.. కిస్ లు అనేవి కామన్. కాకపోతే ఇది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరగడంతో కొంత మంది హవ్వా.. ఆ హగ్గులు ఏంటి..? ఆ కిస్సులు ఏంటి..? అపచారం అంటూ హడావిడి చేశారు. ఇక మీడియా దీనిన్ని ఇంకాస్త పెద్దది చేసింది. అయినా ఇప్పుడున్న జనరేషన్ కి తెలియదు ఏమో కానీ.. గుడి పై శృంగార భంగిమలతో బొమ్మలే పెట్టినప్పుడు జస్ట్ ఈ హగ్, కిస్ పెద్ద తప్పేం కాదు. కాకపోతే కొంత మంది మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక నుంచి ఇలా జరగకుండా జాగ్రత్త పడితే మంచిది.