పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో క్రేజ్ ఉన్న సినిమా ఓజీ. ఈ మూవీకి సుజిత్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆమధ్య ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ కావాల్సింది కానీ.. అలా జరగలేదు. అందుకనే పవర్ స్టార్ ఎక్కడకు వెళితే అక్కడ అభిమానులు ఓజీ ఓజీ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. ఓజీ ఓజీ అని అరుస్తుంటే నన్ను బెదిరిస్తున్నట్టుగా ఉందని పవర్ స్టార్ ఇటీవల చెప్పారు.
ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఓజీ నుంచి ఓ ట్రీట్ రాబోతోందని తెలిసింది. సంక్రాంతికి వస్తోన్న సినిమాలతో పాటు ఓజీ లేటెస్ట్ టీజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఈ టీజర్ కు సంబంధించి సెన్సార్ కంప్లీట్ అయినట్టుగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఓజీ నయా టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇది మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఊహించని ట్రీమ్ అని చెప్పచ్చు. ఈ ఇయర్ సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించబోతున్నారట.