“ఓజీ” పవర్ నెంబర్స్ ఇవే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్ కు వస్తున్న నెంబర్స్ చూస్తుంటే పవర్ స్టార్ డమ్ తెలిసిపోతోంది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ ఉదయం 10.35 నిమిషాలకు హంగ్రీ చీతా పేరుతో ఓజీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ రిలీజైన క్షణం నుంచే కొత్త రికార్డులను మొదలయ్యాయి.

ఓజీ గ్లింప్స్ ఇప్పటిదాకా 5 లక్షల లైక్స్ తో 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్ కు వచ్చిన పవర్ నెంబర్స్ చూస్తే…తొలి 7 నిమిషాల్లో లక్ష లైక్స్, 20 నిమిషాల్లో 2 లక్షల లైక్స్, 44 నిమిషాల్లో 3 లక్షల లైక్స్, 99 నిమిషాల్లో 4 లక్షల లైక్స్ , 196 నిమిషాల్లో 5 లక్షల లైక్స్ తెచ్చుకుంది. ఇదంతా కేవలం 5 గంటల్లో సోషల్ మీడియాలో ఓజీ చేస్తున్న సెన్సేషన్. దీన్ని బట్టి చూస్తే 24 గంటల టైమ్ ఫ్రేమ్ లో ఓజీ ఎన్ని సోషల్ మీడియా రికార్డులు తుడిచేస్తుందో చూడాలి.