పాన్ ఇండియా మూవీగా ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న మూవీ ఓజీ. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ఎస్ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇంకా చెప్పాలంటే.. ఓజీ గ్లింప్స్ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే.. ఇది కదా మాకు కావాల్సింది అంటూ మరింత ఆతృతగా ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు పవన్ పాన్ ఇండియా మూవీ చేయలేదు. హరి హర వీరమల్లు పవన్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అయితే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందో ఎవరికీ క్లారిటీ లేదు. తాజా వార్త ఏంటంటే.. ఓజీ మూవీని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా గ్లింప్స్ ద్వారా తెలియచేశారు. దీనిని బట్టి ఓజీ పాన్ ఇండియా మూవీగా రానుంది. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. డిసెంబర్ లో విడుదల అంటున్నారు కానీ.. సమ్మర్ లో రిలీజ్ అనే టాక్ వినిపిస్తుంది. మరి.. పవన్ పాన్ ఇండియా రేంజ్ లో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.