రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంధ మూవీ అందరు అనుకున్నట్లుగానే సలార్ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ సలార్ మూవీ విడుదల పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్ ను స్కంధ ఆక్యుపై చేయాలని నిర్ణయించుకుంది.
ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా..సయీ మంజ్రేకర్ మరో కీ రోల్ ప్లే చేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ టార్గెట్ చేయబోతోంది. ఇప్పటివరకు ట్రైలర్, పాటలకు ఆశించిన రెస్పాన్స్ అయితే రాలేదు. థియేటర్ లో స్కంధ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.