ఓ సాథియా మూవీ ట్రైలర్ విడుదల చేసిన కెఎస్ రామారావు!!

o sathiya movie trailer releaseప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు గారి చేతుల మీదుగా ఓ సాథియా ట్రైలర్ విడుదల అయింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత KS రామారావు మాట్లాడుతూ.. ఒక చిన్న సినిమా తీసి, రిలీజ్ అవ్వడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ గారు కూడా కష్టపడి పైకి వచ్చారు. కష్టపడాలి అప్పుడే పైకి వస్తాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయాలి. ఈ సినిమాని ఇంటర్నేషనల్ సంస్థ UFO రిలీజ్ చేయడం చాలా మంచి విషయం. UFO లాంటి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేయడం ఈ సినిమా వాళ్ళ అదృష్టం. నేను కూడా సినిమా కెరీర్ లో చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు బాగుంది అని చెప్తే సినిమా సక్సెస్ అయినట్టే. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పబ్లిసిటీ అవసరం. ప్రతి నిర్మాతకు ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక సక్సెస్ ఉంటుంది. నా బర్త్ డే జులై 7. ఆ రోజే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా హిట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ఇక్కడ అందరూ యంగ్‌స్టర్స్ ఉన్నారు, మమ్మల్ని పెద్దవాళ్ళు అంటున్నారు, మేము కూడా యంగ్‌స్టర్సే. అమ్మ, నాన్న, ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, ఫస్ట్ లవ్ అందరికి ఇష్టం. హీరో తన గురించి చెప్తుంటే నా మొదటి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి. అందరికి ఆ కష్టాలు ఉంటాయి. ఈ సినిమాకి నిర్మాత, డైరెక్టర్ ఇద్దరూ లేడీస్ కావడం చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నిర్మాతకు ఒక ఇంటికి ఇంకో ఇల్లు రావాలని కోరుకుంటున్నాను. టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే నిజంగానే ఫస్ట్ లవ్ గుర్తుకురావాలని కోరుకుంటున్నాను. అందరికి అల్ ది బెస్ట్ అని తెలిపారు.

హీరో ఆర్యన్ మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంకలో చిన్నప్పటి నుంచి కన్న కల హీరో అవ్వాలని. ఆ కల ఇవ్వాళ నన్ను ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది. ఈ సినిమాకు అన్ని క్రాఫ్ట్స్ లో కనీసం ఓ 150 మంది పనిచేసి ఉంటారు. వాళ్లందరికీ ఓ ఆరు నెలల పాటు నేను ఎంప్లాయిమెంట్ ఇచ్చాను. నేను కన్న కల వల్లే ఇవ్వగలిగాను అని గర్వంగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది. అవకాశాల కోసం తిరిగాను. నేను ఫేస్ చేసిన కొన్ని పరిస్థితులతో బాధపడి నేను నా సొంతంగా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకొని లాక్ డౌన్ లో హీరోగా, డైరెక్టర్ గా సినిమా తీశాను. నా మొదటి సినిమా బడ్జెట్ 40 లక్షలు, హిట్ చేసి నిర్మాతకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు ఈ జర్నీ కొంచెం సక్సెస్ అయినట్టే కదా. నైట్ జాబ్ చేసుకుంటూ పొద్దున సినిమా చేసుకుంటూ చాలా కష్టపడ్డాను. ఆడియన్ పాయింట్ అఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలని కష్టపడ్డాను. నిర్మాత గారికి కథ చెప్పినప్పుడు ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు నన్ను నమ్మి ఈ సినిమాపై పెట్టారు. ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి. ఆడియన్స్ థియేటర్ కి వచ్చి జులై 7న సినిమా చూడండి. మొదటి రోజు థియేటర్ కి వచ్చి చూడండి. సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఒక మంచి చిరునవ్వుతో వెళ్తారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ చాలా థ్యాంక్స్ అని ఎమోషనల్ గా మాట్లాడారు.

హీరోయిన్ మిస్ట్రీ చక్రవర్తి మాట్లాడుతూ.. నాకు తెలుగు ప్రేక్షకులు అంటే చాలా ఇష్టం. తెలుగురాకపోయినా ట్రై చేస్తాను మాట్లాడటానికి. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో సపోర్ట్ చేసిన నిర్మాతలకు చాలా థ్యాంక్స్. హీరోతో చాలా సరదాగా ఉండేది. షూటింగ్ సమయంలో చాలా ఫైట్ చేసుకున్నాము, వర్క్ లో చాలా సపోర్ట్ చేశాడు. ఆర్యన్ బాగా కష్టపడతాడు. భవిష్యత్తులో చాలా సక్సెస్ అవుతాడు. ఈ సినిమాకి కష్టపడిన వాళ్లందరికీ థ్యాంక్స్. ఇక ఆడియన్స్ చేతుల్లోనే ఉంది మా సినిమా అని అన్నారు.

నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. మాలాంటి యంగ్‌స్టర్స్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన KS రామారావు, త్రినాథరావు గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నాం. నేను ఓ IT కంపెనీకి డైరెక్టర్ గా చేస్తున్నాను. హీరో ఆర్యన్ గతంలో జీ జాంబీ అనే ఓ సినిమా చేశాడు. ఆ సినిమాకి స్పాన్సర్ షిప్ చేశాను. అప్పుడు ఆ సినిమాకు డైరెక్షన్, అన్ని తానే చేసుకుంటూ, నైట్ షిఫ్ట్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ ఆ సినిమా కోసం కష్టపడ్డాడు. సక్సెస్ గా రిలీజ్ చేసి నిర్మాతకు ప్రాఫిట్స్ ఇచ్చి వచ్చేశాడు. నేను ఇల్లు కొనుక్కుందామని దాచుకున్న డబ్బులతో ఈ సినిమా తీశాను. ఆర్యన్ వచ్చి నాకు కథ చెప్పి ప్రొడ్యూసర్స్ చూడమన్నాడు. కరోనా సమయంలో అన్ని రంగాలు ఆగిపోయినా ఎంటర్టైన్మెంట్ పెరిగింది. దీంతో నేనే ఆలోచించి నిర్మాతగా మారాను. ఆర్యన్ అందర్నీ తీసుకొచ్చి సినిమాని ముందుండి నడిపించాడు. సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన UFO సంస్థకి చాలా థ్యాంక్స్. ఫస్ట్ లవ్ గురించి ఈ సినిమా. ఈ సినిమా చూశాక అందరికి తమ ఫస్ట్ లవ్ గుర్తుకొస్తుంది అని తెలిపారు.

ఓ సాథియా డైరెక్టర్ దివ్య భావన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన KS రామారావు, త్రినాథరావు గారికి థ్యాంక్యూ సర్. నా గురువు గారు విజయేంద్రప్రసాద్ గారివల్లే ఇక్కడ ఉన్నాను. ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేసిన నిర్మాత సుభాష్ గారికి, హీరో ఆర్యన్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి పని చేసి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లందరికీ చాలా థ్యాంక్స్ అని అన్నారు.

UFO లక్ష్మణ్ మాట్లాడుతూ.. సినిమా మేము ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కంటే కూడా మీడియానే ఎక్కువగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తుంది. దానివల్లే ఆడియన్స్ వస్తారు. ఇది మంచి లవ్ స్టోరీ, ఓటీటీలో చూసేది కాదు. థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. సినిమా బాగుంది కాబట్టే మేము రిలీజ్ చేస్తున్నాం. హీరో బాగా నటించాడు. సాంగ్స్ బాగా వినిపిస్తాయి. ఇక్కడ గెస్ట్ గా వచ్చిన నిర్మాత KS రామారావు గారు నాకు గాడ్ ఫాదర్ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ విన్ను మాట్లాడుతూ.. నా సెకండ్ సినిమాకే ఇంత మంచి లిరిక్స్ కి సంగీతం అందించే అవకాశం వచ్చింది. పాటలు చాలా బాగా రాశారు. మంచి సంగీతం అందించాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, డైరెక్టర్ కి థ్యాంక్స్ అని తెలిపారు.

ఎడిటర్ కార్తీక్ మాట్లాడుతూ.. గెస్ట్ గా వచ్చిన హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్, నిర్మాతలకు చాలా థ్యాంక్స్. ఓ సాథియా సినిమా కథ చెప్పినప్పుడు నచ్చి చేశాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసిన నా అసిస్టెంట్ ఎడిటర్స్ కి చాలా థ్యాంక్స్ అని అన్నారు.

లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ.. ఆర్య నాకు 7 ఏళ్లుగా తెలుసు. అతనికి సినిమాలంటే పిచ్చి. జాబ్ చేస్తూనే సినిమాలు చేస్తాడు. అందరితో మంచిగా ఉండి మంచి అవుట్ పుట్ తీసుకుంటాడు. డైరెక్టర్ దివ్యగారిని నేనే ఆర్యన్ గారికి పరిచయం చేశాను. ఆవిడకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారితో గతంలోనే పనిచేశాను. అందరికి అల్ ది బెస్ట్ అని అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చంద్ర తివారి మాట్లాడుతూ.. తన్విక జశ్విక ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఓ సాథియా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ అని తెలిపారు.