ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ నుంచి మరో క్రేజీ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సలార్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది.
సలార్ సినిమా చివరలో ఎన్టీఆర్, కన్నడ స్టార్ యష్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తారట. ఎండ్ టైటిల్స్ ముందు ఈ ఇద్దరు స్టార్స్ స్క్రీన్ మీదకు వస్తారని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో ప్రశాంత్ నీల్ కొత్త మూవీస్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సిఉంది.
యష్ తో కేజీఎఫ్ 3కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఏదైనా హిట్ సలార్ ఎండింగ్ లో ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఏమైనా ప్రభాస్ సినిమాలో ఎన్టీఆర్, యష్ కనిపిస్తే…అది సినిమాకు మరో అట్రాక్షన్ అవుతుంది.