రజినీతో ఎన్టీఆర్ కు ‘వార్’ తప్పదా

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న క్రేజీ మూవీ వార్ 2. ఈ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ లపై భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. అలాగే నాటు నాటు రేంజ్ లో ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ఆగష్టు 14న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న వార్ 2 పక్కాగా అనౌన్స్ చేసిన డేట్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఊహించని విధంగా రజినీ, నాగ్, ఉపేంద్ర కాంబోలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తోన్న కూలీ కూడా వార్ 2 రిలీజ్ డేట్ అయిన ఆగష్టు 14నే రిలీజ్ కానుందని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది.

ప్రచారంలో ఉన్నది నిజమైతే.. రెండు సినిమాలు ఓకేసారి రిలీజ్ అయితే.. వార్ 2 కు సౌత్ లో ఎఫెక్ట్ ఎక్కువుగా ఉంటుంది. కూలీ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఆగష్టు 14న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే.. కూలీ కనుక ఆగష్టు 14నే విడుదల చేయాలి అనుకుంటే.. వార్ 2 రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారడం ఖాయం.