జపాన్ లో సందడి చేస్తున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ దేవర సినిమాను జపాన్ లో ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఆన్ లైన్ లో ప్రమోషన్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్ లో దేవర ప్రీమియర్ షో కోసమని అక్కడకు వెళ్లారు. జపాన్ వచ్చిన ఎన్టీఆర్ కు అక్కడ అభిమానులు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జపాన్ లో సందడి చేస్తున్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే.. ఇండియాలో బ్లాక్ బస్టర్ అయిన దేవర జపాన్ లో ఎంత వరకు మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా షూట్ లో జాయిన్ కానున్నాడు. ఇది పూర్తైన తర్వాత దేవర 2 షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకరిద్దరు యంగ్ డైరెక్టర్స్ తోనూ ఎన్టీఆర్ మూవీ ప్లాన్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.