యంగ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా

స్టార్, పాన్ ఇండియా డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ (NTR) ఓ యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. నానితో హాయ్ నాన్న (Hi nanna) సినిమాను రూపొందించిన దర్శకుడు శౌర్యువ్(Shouryuv) తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషనల్ కంటెంట్ తో హాయ్ నాన్న సినిమాను రూపొందించారు శౌర్యువ్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకున్నా ఫర్వాలేదనే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసే అవకాశం దక్కించుకున్నాడట.

వైరా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2 మూవీ చేస్తున్నారు. దేవర ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా..వార్ 2 (War 2) సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత ఎన్టీఆర్ శౌర్యువ్ సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.