ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 14న వార్ 2 రిలీజ్ కానుంది. ఇటీవల ప్రశాంత్ నీల్ తో సినిమాను స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. త్వరలో ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేయనున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత దేవర 2 ఉంటుంది అనుకుంటే.. వేరే సినిమాను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఉంటుందట. ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నాడని తెలిసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశారని.. ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాను 2026లో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. నెల్సన్.. ఎన్టీఆర్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇందులో మాస్, యాక్షన్, కామెడీ అంశాలు సమపాళ్లలో ఉండేలా కథను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవర 2 గురించి క్లారిటీ ఇవ్వకుండా.. నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ ఫైనల్ చేయడం ఆసక్తిగా మారింది.