ఫ్యామిలీ ఫంక్షన్ కు దూరంగా ఎన్టీఆర్

సీనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ముద్రించిన వంద రూపాయల నాణేం విడుదల కార్యక్రమం ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పురంధేశ్వరి, బాలకృష్ణ హాజరవుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లాల్సి ఉండగా..వీళ్లిద్దరు పాల్గొనడం లేదని తెలుస్తోంది. ముందుగా పెట్టుకున్న షూటింగ్స్ కారణంగా వెళ్లడం లేదని తెలుస్తున్నా..ఇది అభిమానులకు బాధ కలిగించే విషయమే అనుకోవాలి.

ఎన్టీఆర్ దేవర సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉండగా…కళ్యాణ్ రామ్ ముందస్తు షెడ్యూల్ ప్రోగ్రామ్స్ వల్ల వెళ్లడం లేదని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ను కేంద్రప్రభుత్వం గౌరవించి వంద రూపాయల నాణేం విడుదల చేస్తున్న సందర్భం మిగతా పనులన్నంటికీ కన్నా పెద్దదే. ఈ అరుదైన సందర్భానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరుకాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఒక్కరోజు గ్యాప్ తీసుకుంటే వచ్చే నష్టం కంటే…ఈ మెమొరీ అరుదైనదని అంటున్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరు, ఫొటో ముద్రించిన 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేయబోతున్నారు.