ఎన్టీఆర్ కొత్త రికార్డ్

స్టార్ హీరో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో ఘనత సాధించారు. ప్రముఖ మేగజైన్ ఏషియన్ వీక్లి టాప్ 50 లో చోటు సంపాదించుకున్నారు. సినీ సెలబ్రిటీల విభాగంలో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా…టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రాజమౌళి ప్లేస్ దక్కించుకున్నారు. టాలీవుడ్ నుంచి ఏషియన్ వీక్లీ 50లో ఎంపికైన ఏకైక హీరోగా ఎన్టీఆర్ కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ పలు అంతర్జాతీయ అవార్డులూ, గుర్తింపులూ పొందుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఇది కాకుండా ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ఫైటర్ 2 ఉన్నాయి.