స్టార్ హీరో ఎన్టీఆర్ రాజకీయాలకు తాను పూర్తిగా దూరమనే సంకేతాలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఇప్పుడున్న ప్రభుత్వంతో లేని పోని చిక్కులు తెచ్చుకోవడానికి ఎన్టీఆర్ ఇష్టపడటం లేదని అనుకోవచ్చు.
ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ నే ఫాలో అవుతున్నారు. ఎక్కడా చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడటం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయ్యారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నారు. బాలకృష్ణ నుంచి నందమూరి ఫ్యామిలీలో దాదాపు అందరూ చంద్రబాబుకు మద్దతుగా స్పందిస్తున్నారు.
ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ఫిల్మ్ కెరీర్ మీదే దృష్టి సారించారు.