యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. వార్ 2 ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఎంట్రీ మూవీ కానుంది. అయితే దీని కంటే ముందే ఎన్టీఆర్ ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నారు. ఆ సినిమానే టైగర్ 3.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సుల్లో ఎన్టీఆక్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. టైగర్ 3లో ఇప్పటికే షారుఖ్ అతిథి క్యారెక్టర్ చేస్తుండగా..ఇప్పుడు ఎన్టీఆర్ కూడా జాయిన్ అవడం ఆ సినిమా మీద మరింత క్రేజ్ తీసుకురానుంది.
టైగర్ సిరీస్ సినిమాల్లో వస్తున్న మూడో చిత్రం టైగర్ 3. ఇప్పటికే ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు హిట్ అయ్యాయి. టైగర్ 3 సినిమాను మనీశ్ శర్మ రూపొందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 10న టైగర్ 3 రిలీజ్ కాబోతోంది.