హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందిన దేవర మంచి సక్సెస్ అందుకుంది. ఇటీవల ఈ చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేశారు. అక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, కొరటాల వెళ్లడం.. ప్రమోట్ చేశారు. ఎన్టీఆర్ కు జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దేవర రిలీజ్ అయినప్పటి నుంచి దేవర 2 లేదు అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు దేవర తర్వాత అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమాలు చేస్తుండడంతో దేవర 2 నిజంగానే లేదు అనుకున్నారు అభిమానులు, సినీ జనాలు.
ఈ రూమర్స్ కు చెక్ పెట్టారు ఎన్టీఆర్. నిన్న మ్యాడ్ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ కు వచ్చిన ఎన్టీఆర్ దేవర 2 లేదనుకుంటున్నారు కానీ.. ఉంది. దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది అని అభిమానుల సమక్షంలో క్లారటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇలా చెప్పడంతో దేవర 2 పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. కొరటాల ప్రస్తుతం కథ పై కసరత్తు చేస్తున్నారట.