గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ప్రస్తుతం వార్ 2 మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. వార్ 2 మూవీ తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. అయితే.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఇది నిజమేనా..?
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తోన్న వార్ 2 మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా షూట్ లో జాయిన్ అవుతాడు. ఇందులో ఎన్టీఆర్ ను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడని తెలిసింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉందని.. ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ కు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ స్టోరీ చెప్పాడట. ఈ కథ నచ్చడంతో మూవీ చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. ఈ మూవీని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే.. సితార ఎంటర్ టైన్మెంట్స్ లేదా హోంబలే బ్యానర్ పేర్లు వినిపించాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్, నెల్సన్ మూవీని నిర్మించేందుకు పోటీపడ్డాయట కానీ.. ఎన్టీఆర్ సితార సంస్థకే ఛాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించనున్నాడని తెలిసింది. అయితే.. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమా కంప్లీట్ చేయాలి. నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 కంప్లీట్ చేయాలి. ఇవి పూర్తైన తర్వాత ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ సెట్స్ పైకి వస్తుందని తెలిసింది. ఈ క్రేజీ మూవీ పై మరింత క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.