భారీ ఫైన్ సీక్వెన్సులో ఎన్టీఆర్ “దేవర”

ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరలో యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోతాయనే న్యూస్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో తండ్రి పాత్రలో ఎన్టీఆర్ చేసే పోరాట ఘట్టాలు సినిమాకే ఆకర్షణ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్సుల చిత్రీకరణ విషయంలో దర్శకుడు కొరటాల శివ పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నారట. నెక్ట్ వీక్ నుంచి దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.

ఈ కొత్త షెడ్యూల్ లో పెద్ద స్విమ్మింగ్ పూల్ సెట్ లో ఎన్టీఆర్, విలన్ సైఫ్ అలీఖాన్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ స్టంట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ ఫైట్ కోసం సెట్ ను భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారట. దాదాపు ప్రతి షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తుండటంతో సినిమాలో పైట్స్ హైలైట్ అవుతాయని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కాబోతోంది.