అప్పుడు బాబీ చెప్పిన మాటలే ఇప్పుడు మెహర్ చెబుతున్నాడు

సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమాను రూపొందించిన దర్శకుడు బాబీ మాటలు మరోసారి గుర్తు చేస్తున్నారు భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని…ఆయన తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో తెలుసని, ఒకప్పటి మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీస్ చూసిన ఫీల్ ను భోళా శంకర్ తిరిగి తెస్తుందని అంటున్నాడు మెహర్.సేమ్ టు సేమ్ బాబీ కూడా ఇలాగే చెప్పాడు వాల్తేరు వీరయ్య ప్రమోషన్ లో. అభిమానుల మాటలన్నీ ఒకేలా ఉంటాయని అనుకోవచ్చు.

మెహర్ రమేష్ ఇవాళ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – నాకు ఫాస్ట్ గా సినిమా చేయడం అలవాటు. భోళా శంకర్ ను
120 రోజుల్లో తెరకెక్కించా. అన్నయ్య పిలిచి స్పీడ్ గా మూవీ చేశావ్ రా అని మెచ్చుకున్నారు. నా కమ్ బ్యాక్ మూవీ అన్నయ్యతోనే చేయాలని అనుకున్నా. వేదాళం సినిమాకు దాదాపు 70శాతం మార్పులు చేశాం. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. సెకండాఫ్ లో మెగాస్టార్ ను మరోలా చూస్తారు. మెగాస్టార్ చిరంజీవికి నేను కజిన్ ను. చిన్నప్పటి నుంచి ఆయనకు దగ్గరగా ఉండేవాడిని. ఇవాళ అన్నయ్యతో సినిమా చేయడం గర్వంగా ఉంది. ఒకప్పటి మెగాస్టార్ బ్లాక్ బస్టర్స్ రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి ఫీల్ ను భోళా శంకర్ ఇస్తుంది. అన్నారు