జాన్వీతో కలిసి నటించడం లేదన్న నాని

తన కొత్త సినిమాలో జాన్వీ కపూర్(jhanvi kapoor) నటించడం లేదని తెలిపారు హీరో నాని(Nani). ఆయన హీరోగా నటిస్తున్న 33(Nani 33)వ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాను దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) రూపొందిస్తున్నారు. దసరా కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి నాని 33 ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ కాంబో మూవీలో జాన్వీ హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలపై నాని స్పందించారు. ఇంకా స్క్రిప్ట్ వర్కే కంప్లీట్ కాలేదని, ఆమెను తమ టీమ్ సంప్రదించి ఉంటే ఉండొచ్చని, ఇది రూమర్ గానే తాను భావిస్తున్నానని నాని తెలిపారు. తెలుగులో దేవరతో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో నటిస్తోంది. ఆమెకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే నానితో జాన్వీ నటిస్తుందనే వార్త ఆసక్తికరంగానే ప్రచారమవుతోంది.