హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నట్లు వార్తలను తీవ్రంగా ఖండించారు హీరో విశాల్. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక అమ్మాయిని ఈ వార్తల్లో చేర్చారు కాబట్టే తాను స్పందిస్తున్నట్లు విశాల్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో విశాల్ స్పందిస్తూ – ఫేక్ వార్తలపై నేను స్పందించను. ఎందుకంటే వాటిపై మాట్లాడి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో లక్ష్మీ మీనన్ పేరు పేర్కొంటున్నారు. ఆ అమ్మాయి పేరు తీసుకొచ్చినందుకు నేను స్పందిస్తున్నాను. ఇదొక అమ్మాయి వ్యక్తిగత జీవితానికి చెందిన విషయం. రేపు ఆ అమ్మాయి జీవితంపై ఇదొక మచ్చ కాకూడదు. భవిష్యత్ లో జరగాల్సిన నా పెళ్లి తేదీ, సమయం వంటి వివరాలన్నీ ముందే రాయడం ఎందుకు. అదేమైనా పెద్ద మిస్టరీనా. పెళ్లి కుదిరినప్పుడు నేనే చెప్తా. అని పేర్కొన్నారు.