వర్మ “సిండికేట్”లో స్టార్స్ లేరు

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సత్య మూవీని మళ్లీ చూసి నేనేనా ఈ సినిమాను తీసాను అని ఆశ్యర్యపోయానని.. ఇక నుంచి తన నుంచి రియల్ ఫిల్మ్ మేకర్స్ అనిపించేలా సినిమాలు వస్తాయని ప్రకటించాడు. అంతే కాకుండా.. సిండికేట్ అనే సినిమా చేయబోతున్నాను అని కూడా అనౌన్స్ చేశాడు. అయితే.. ఇందులో ఎవరు నటించనున్నారో ప్రకటించలేదు. ఇక అప్పటి నుంచి వర్మ సిండికేట్ లో నటించే స్టార్స్ అంటూ అమితాబ్, వెంకీ, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

దీంతో వర్మ మరోసారి రంగంలోకి దిగాడు. ఓ సెక్షన్ మీడియాలో నడుస్తున్న ప్రచారంలో నిజం లేదని, అదంతా ఫేక్ అని ప్రకటించాడు. త్వరలోనే నటీనటుల వివరాలను తానే ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. నిజంగా ప్రచారంలో ఉన్నట్టుగా అమితాబ్, వెంకీ కాంబోలో సిండికేట్ మూవీ చేసుంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేదని వార్తలు వచ్చాయి. అమితాబ్, వెంకీతో గతంలో వర్మ సినిమాలు తీసిన అనుభవం ఉండడంతో ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ క్లారిటీ ఇవ్వడంతో ఎవర్నీ ఈ మూవీ కోసం ఎంపిక చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. మరి.. వర్మ సిండికేట్ లో నటించే స్టార్స్ ఎవరూ అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.