బజ్ లేని “సంక్రాంతికి వస్తున్నాం”

వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎందుకనో బజ్ రావడం లేదు. ప్రేక్షకులు రా అండ్ రస్టిక్, భారీ యాక్షన్ మూవీస్ కు అలవాటు పడే ట్రెండ్ లో ఉండటమే ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ చూపించారు. ఇవి ఆడియెన్స్ ను ఎగ్జైట్ చేయడం లేదు.

అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్. కానీ వెంకటేష్ ఫామ్ లో లేడు. ఈ కాంబోకు అనుకున్నంత క్రేజ్ రావడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిజినెస్ కూడా అంతంతమాత్రంగా జరుగుతుండటం కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ట్రేడ్ లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏమైనా సంక్రాంతి పండుగకు సకుటుంబంగా చూడాల్సిన కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనుకున్నంత హైప్ రాకపోవడం బ్యాడ్ టైమ్ అనుకోవచ్చు. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది.