స్టార్ హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుంటే ఆ సినిమా వర్కవుట్ కాదు. మెగాస్టార్ ఇమేజ్ ఉన్న చిరంజీవికి ఇవి మరింత ఎక్కువగా ఉండాల్సిందే. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి వీటికి భిన్నంగా మెగాస్టార్ తో మూవీ చేస్తున్నాడనే వార్తలు ఆశ్చర్యపరుస్తున్నాయి. చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీకి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. చిరంజీవి సినిమాల్లో పాటలు హైలైట్ అవుతుంటాయి. అందులో డ్యూయెట్ సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో మెగాస్టార్ కు డ్యూయెట్స్ ఉండవనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సినిమాలో చిరంజీవిని ప్యామిలీ మేన్ గా చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి. సినిమా అంతా రాయలసీమ యాసలోనే ఉంటుందని సమాచారం. మెగాస్టార్ సినిమా అంటే ఆడియెన్స్ డ్యూయెట్స్ ఎక్ప్ పెక్ట్ చేస్తారు. అలాంటిది అవేవి ఉండవు అంటే ప్రయోగమే. ఈ ఎక్స్ పెర్మెంట్ మెగాస్టార్ మూవీకి ఎంతగా వర్కవుట్ అవుతుంది అనేది చూడాలి. షైన్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మే లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.