అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూవీ ఫిక్స్ అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. క్లారిటీ లేదు. ఇటీవల అట్లీతో బన్నీ మూవీ సెట్ అయ్యిందని ప్రచారం ఊపందుకుంది. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనౌన్స్ మెంట్ లేదు. ఈమధ్య కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరగడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఏ సినిమా ముందుగా స్టార్ట్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది.
ఈ మూవీ నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఇయర్ ద్వితీయార్ధంలో బన్నీ, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంటే.. జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవ్వచ్చు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఎక్కువ టైమ్ పడుతుందని.. అలాగే కథ పై త్రివిక్రమ్ మరింత కేర్ తీసుకుంటున్నారని.. అందుకనే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని అసలు విషయం బయటపెట్టారు నాగవంశీ. అయితే.. బన్నీ.. అట్లీతో మూవీ, త్రివిక్రమ్ మూవీ ఒకేసారి చేస్తారా..? లేక ఒక దాని తర్వాత మరోటి చేస్తారా..? అనేది తెలియాల్సివుంది.