“ఇండియన్ 2” ఇప్పట్లో విడుదల కాదా..?

యూనివర్శిల్ హీరో కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఇండియన్. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారు కానీ.. అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఒకానొక దశలో ఇక ఇండియన్ 2 మూవీ పూర్తిగా ఆగిపోయింది అనుకున్నారు. అయితే… విక్రమ్ సినిమాతో కమల్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో ఇండియన్ 2 మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

గేమ్ ఛేంజర్ మూవీని పక్కనపెట్టి మరీ.. శంకర్ ఇండియన్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు..? అనేది సస్పెన్స్ గా మారింది. సంక్రాంతికి కానీ.. సమ్మర్ లో కానీ… విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు సంక్రాంతికి, సమ్మర్ కి రావడం లేదని టాక్ వినిపిస్తోంది. మరి.. ఎప్పుడు వస్తుంది అంటే.. 2024 ఎండింగ్ లో లేదా.. 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇండియన్ 2 ఇంత ఆలస్యంగా వస్తే.. ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.