మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కన్నప్ప. పదేళ్ల నుంచి మంచు విష్ణు ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు. నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 25న కన్నప్ప
రిలీజ్ అనుకుంటే ఊహించని విధంగా పోస్ట్ పోన్ అయ్యింది.
కన్నప్ప టీమ్ ప్రివ్యూ వేసుకున్నారని.. ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందని టాక్ వచ్చింది. అంతే కాకుండా.. బిజినెస్ ఇంకా జరగలేదని..బయ్యర్స్ దొరకడం లేదని ఈ కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో ఉన్న వార్తల పై మంచు విష్ణు టీమ్ స్పందించింది. ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలేదని.. వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని చెప్పారు. అంతే కాకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయద్దు.. ఎవరు నమ్మద్దు అని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. త్వరలోనే కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం.