నిన్న సాయి పల్లవి, నేడు నిత్యా మీనన్…సోషల్ మీడియాతో ఇబ్బందులు

సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు స్టార్స్. వాళ్లకు సోషల్ మీడియా ఎంత యూజ్ అవుతుందో ..అంత ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతోంది. రీసెంట్ గా సాయి పల్లవి ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుందంటూ ఆమె సినిమా ముహూర్తపు సన్నివేశంలో పూలదండలు వేసుకున్న ఫొటోస్ వైరల్ చేశారు. ఈ పోస్టులపై సాయి పల్లవి తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఒక పోస్ట్ నిత్యా మీనన్ గురించి వైరల్ అవుతోంది.

తెలుగులో నటించేప్పుడు తానేమీ ఇబ్బంది పడలేదని , అయితే ఒక తమిళ హీరో తనను వేధించాడని నిత్యామీనన్ చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు వస్తున్నాయి. దీనిపై నిత్యామీనన్ స్పందించింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ గా వెల్లడించింది. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండని, ఏదైనా న్యూస్ నిజమో కాదో తెలుకుకోవాలని నిత్యా సూచించింది. ఆమె తాజాగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నటించింది.