“ఎల్లమ్మ” హీరో మారాడు

బలగం(Balagam) సినిమాతో తెలంగాణ రూటెడ్ మూవీ చేశాడనే పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు వేణు(Balagam venu). కమెడియన్ గా కెరీర్ సాగించిన వేణు ఇలాంటి ఎమోషనల్ మూవీ చేసి అవార్డులు రివార్డులూ అందుకున్నాడు. ఈ ఉత్సాహంలో బలగం వేణు ఎల్లమ్మ(Ellamma) అనే మరో తెలంగాణ నేపథ్య కథ రెడీ చేసుకున్నాడు. దిల్ రాజు(Dil raju) ప్రొడక్షన్ లో నాని(Nani) హీరోగా ఈ సినిమా తెరకెక్కాలి.

అయితే నాని అడిగిన 25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దిల్ రాజు నిరాకరించారు. అటు నాని కూడా నిర్ణయం మార్చుకోలేదు. ఫలితంగా ఎల్లమ్మ హోల్డ్ లో పడింది. ఇప్పుడీ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. నితిన్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. బలగం వేణు కూడా నాని కాదన్నప్పుడు నితిన్ మంచి ఆప్షన్ గానే భావిస్తున్నాడు. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.