నితిన్ 32 ఫస్ట్ లుక్ ముహుర్తం ఫిక్స్.

నితిన్ ఇస్క్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు. ఆతర్వాత గుండెజారీ గల్లంతయ్యిందే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అయితే.. ఆతర్వాత ఫర్వాలేదు అనిపించే సినిమాలు చేశాడు. భీష్మ కమర్షియల్ గా సక్సెస్ అందించింది. ఆతర్వాత నుంచి సరైన సక్సెస్ రాలేదు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాచర్ల నియోజకవర్గం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నితిన్ 32వ చిత్రం. వక్కంతం వంశీ తెరకెక్కించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సక్సెస్ కాకపోయినా అతని పై నమ్మకంతో సినిమా చేస్తున్నాడు.

ఇందులో నితిన్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. ఎప్పటి నుంచో సినిమా పై రకరకాల వార్తలు వస్తున్నాయి. షూటింగ్ ఆగిపోయిందని… మళ్లీ కథ పై కసరత్తు చేస్తున్నారని.. హీరో, డైరెక్టర్ మధ్య గ్యాప్ వచ్చిందని.. ఇలా ప్రచారం జరిగింది. మొత్తానికి అంతా సెట్ అయ్యింది అనుకుంట ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 23న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌ అనే టైటిల్‌ పెడుతున్నారనే టాక్ వచ్చింది. ఈ టైటిల్ నే పెడతారా..? లేక వేరే టైటిల్ పెట్టారా..? అనేది ఈ నెల 23న తెలుస్తుంది.