నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో మరోసారి టాలీవుడ్ వార్తల్లో నిలిచింది. కేపీ చౌదరి అరెస్ట్ తర్వాత 12 మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఆ లిస్ట్ లో అషు రెడ్డి ఉందని ప్రచారం జరిగింది. అయితే.. అషు రెడ్డి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన పేరును ఎందుక ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. త్వరలోనే పోలీసులు, ఛార్జ్ షీట్ తయారు చేసి, కొంత మందికి నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో హీరో నిఖిల్ సంచలన ప్రకటన చేశాడు. ఇంతకీ నిఖిల్ ఏమన్నాడంటే.. తనకు చాలా మంది, చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారన్నాడు. అంతే కాకుండా.. సిగరెట్ నుంచి మొదలుపెడితే, నార్కోటిక్స్ వరకు చాలా ఆఫర్లు వచ్చాయని, అలాంటి పరిస్థితులకు లొంగకుండా ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తులుగా ఎదుగుతామని అన్నాడు. నిఖిల్ చెప్పిన ఈ మాటలు సంచలనం అయ్యాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నిఖిల్, ఇలా డగ్ర్స్ గురించి మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది.