నిహారిక కొణిదెల హీరోయిన్ గా, టెలివిజన్ హోస్ట్ గా తన కెరీర్ కొనసాగించింది. ఇప్పుడు నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, మూవీస్ చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో ఆమె రూపొందించిన మూవీ కమిటీ కుర్రోళ్లు పెద్ద సక్సెస్ సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ తో ఆర్థికంగా నిహారిక బ్యానర్ సెటిల్ అయ్యింది. ఈ క్రమంలోనే తన కొత్త మూవీకి సన్నాహాలు చేసుకుంటోంది నిహారిక
తమ పింక్ ఎలిఫెంట్ సంస్థలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్న మానస శర్మను దర్శకురాలిగా పరిచయం చేయబోతోంది నిహారిక. కొత్త నటీనటులతో ఆమె ఈ సినిమా నిర్మించనుంది. ప్రొడ్యూసర్ గా కమిటీ కుర్రోళ్లు సినిమాతో వచ్చిన గుడ్ విల్ ను కాపాడుకునేలా తన నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తోంది నిహారిక. ఈ సినిమాను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.