సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా ప్రీమియర్ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై స్పందించింది కొణిదెల నిహారిక. తొలిసారి ఆమె ఈ ఘటన గురించి మాట్లాడింది. నటిగా కొనసాగుతూనే నిర్మాతగా సక్సెస్ అందుకుంది నిహారిక. ఆమె కమిటీ కుర్రోళ్లు మంచి విజయం సాధించింది. తాజాగా తమిళ సినిమా మద్రాస్ కారన్ లో నటించింది నిహారిక. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మద్రాస్ కారన్ ప్రమోషన్ లో నిహారిక సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడింది.
తొక్కిసలాట వార్త తెలిసినప్పటి నుంచి అల్లు అర్జున్ మానసికంగా వేదనకు గురయ్యారని నిహారిక చెప్పింది. ఒకరి ప్రాణాలు పోవడం దురదృష్టకరమైన ఘటన అని, ఇలాంటివి జరగకూడదని నిహారిక పేర్కొంది. అల్లు అర్జున్ ఈ ఘటన మిగిల్చిన బాధ నుంచి తేరుకోవాడనికి కొంత టైమ్ పడుతుందని ఆమె చెప్పింది. అల్లు అర్జున్ కుటుంబం కూడా ఈ ఘటన పట్ల బాధకు లోనైందని నిహారిక తెలిపింది.