బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తన కొత్త సినిమా హరి హర వీరమల్లు రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ ఈ చిత్రంలో నటించింది. తన కెరీర్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కాబట్టి హరి హర వీరమల్లు మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమా మే 9న రిలీజ్ కు రెడీ అవుతోంది.
హరి హర వీరమల్లు మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ తో నిధి అగర్వాల్ చేసిన సాంగ్ కొల్లగొట్టినాదిరో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ పాటలో పవన్, నిధి చేసిన హుక్ స్టెప్ వైరల్ అయ్యింది. ఇప్పుడీ హుక్ స్టెప్ తో రీల్స్ చేయమంటూ ఛాలెంజ్ విసిరింది నిధి అగర్వాల్. ఇన్ఫ్లుయెన్సెర్స్ తో కలిసి ఆమె చేసిన ఈ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.