యంగ్ హీరో ఆశిష్ రెడ్డి రీసెంట్ గా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అద్వైత రెడ్డితో ఆశిష్ వివాహం ఈ నెల 14న రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. ఈ వేడుకలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆశిష్ పెళ్లైన తర్వాత భార్యతో తీసుకున్న ఫొటోను రివీల్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆశిష్, అద్వైత జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉందంటున్నారు నెటిజన్స్. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి వారసుడిగా వచ్చిన ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆశిష్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో సెల్ఫిష్ అనే మూవీ కంప్లీట్ కు వచ్చింది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తన మూడో చిత్రంలో నటిస్తున్నాడు ఆశిష్. ఈ సినిమాలో బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.