డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ ఎంతగా ఆడియెన్స్ ను ఆకట్టుకుందో చూశాం. ఇప్పుడా క్యారెక్టర్ లేకుండానే టిల్లు స్క్వేర్ చేస్తే ఏదో లోపం ఉన్నట్లే కనిపిస్తుంది. మూవీ టీమ్ కూడా ఇదే ఫీలయినట్లున్నారు. రాధికను గెస్ట్ గా అయినా ఈ సినిమాలో చూపించాలని ఫిక్స్ అయ్యారు. టిల్లు స్క్వేర్ సినిమాలో రాధిక కొన్ని సీన్స్ లో సందడి చేయబోతోంది. రాధిక అంటే నేహా శెట్టి అనేంతగా ఆ క్యారెక్టర్ లో నటించింది.
నేహా శెట్టి ఈ సీక్వెల్ లోనూ అంతే క్రేజ్ తీసుకొస్తుందని టీమ్ ఆశిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందిస్తున్నారు. జస్ట్ 2 అవర్స్ మాత్రమే ఈ సినిమా డ్యురేషన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే గత సినిమా డీజే టిల్లులోని ల్యాగ్ లేకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ కు రెడీ అవుతోంది.