నెగిటివ్ టాక్ తెచ్చుకున్న (MAD)2

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సూపర్ హిట్ సినిమా మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూవీ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో సక్సెస్ అందుకున్న సితార సంస్థ మ్యాడ్ స్క్వేర్ తో ఆ ఫీట్ చేయలేకపోయింది. ఈ సినిమాలో కథే లేదు, లాజిక్స్ అడగొద్దు అని పదే పదే మేకర్స్ చెబుతూ వచ్చారు. చెప్పినట్లుగానే మ్యాడ్ 2 లో కథ లేదని, లాజిక్స్ అసలే లేవని టాక్ స్ప్రెడ్ అవుతోంది.

కేవలం కామెడీని నమ్ముకున్న మ్యాడ్ 2 దర్శకుడు కల్యాణ్ శంకర్..మరీ సిల్లీ కామెడీ సీన్స్ తో సినిమాను రూపొందించాడనే ఫీడ్ బ్యాక్ ఈ మూవీకి వస్తోంది. గోవా ఎపిసోడ్ అనుకున్నంత వర్కవుట్ కాలేదని, చాలా సీన్స్ బోర్ కొట్టాయని అంటున్నారు. ఫస్టాఫ్ బెటర్ కాగా, సెకండాఫ్ లో ఆ ఎనర్జీ లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. కామెడీ వర్కవుట్ అయినంత మాత్రాన సినిమాను ఇంత లైట్ తీసుకుని రూపొందించడంపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.